: ప్రసూతి ఆసుపత్రిలో నిర్లక్ష్యం.. ఐదుగురు శిశువుల మృతి


కొత్తగా ప్రారంభించిన ప్రసూతి ఆసుపత్రిలో ఒకేరోజు ఐదుగురు శిశువులు మరణించిన ఘటన పంజాబ్ లో జరిగింది. లూథియానాలోని సివిల్ ఆసుపత్రిలో ఇటీవల అధునాతన సౌకర్యాలతో ప్రసూతి విభాగాన్ని ప్రారంభించారు. ఆదివారం నాడు మొత్తం 19 మంది పిల్లలు పుట్టగా వారిలో ఐదుగురు మరణించారు. విధులకు డాక్టర్లు డుమ్మా కొట్టగా నర్సులు ప్రసవాలు చేశారని, అందువల్లే తమ పిల్లలు చనిపోయారని బంధువులు ఆందోళన చేపట్టారు. ఒకే రోజు ఇంత మంది చనిపోవటాన్ని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

  • Loading...

More Telugu News