: స్మృతి ఇరానీ రాష్ట్రపతి అవుతారట: రాజస్థాన్ జ్యోతిష్యుడి భవిష్యవాణి


కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ భవిష్యత్తులో భారత రాష్ట్రపతి అవుతారట. రాజస్థాన్ లోని ఓ జ్యోతిష్యుడు చెప్పిన ఈ భవిష్యవాణికి ఉబ్బితబ్బిబ్బైన స్మృతి ఇరానీ ఆయనకు కృతజ్ఞతలు కూడా చెప్పుకున్నారు. భర్తతో కలిసి ఆదివారం బిల్వారాలోని కరోయి గ్రామానికి వెళ్లిన స్మృతి ఇరానీకి అక్కడి జ్యోతిష్యుడు పండిట్ నాథులాల్ వ్యాస్ జ్యోతిష్యం చెప్పారు. రాజకీయాల్లో ఉజ్వల భవిష్యత్తు ఉందని, ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక పదవి దక్కుతుందని గతంలో నాథలాల్, స్మృతి ఇరానీకి చెప్పారట. నాథులాల్ చెప్పినట్లుగానే స్మృతి ఇరానీ, మోదీ సర్కారులో కీలకమైన మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

  • Loading...

More Telugu News