: 'బంగారుతల్లి' అప్పుడే పోయింది.. ఈటెల వ్యాఖ్యలతో అసెంబ్లీలో రగడ


'బంగారుతల్లి' పథకం ఉమ్మడి రాష్ట్రంతోనే పోయిందన్న ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌ వ్యాఖ్యలను పలువురు విపక్ష సభ్యులు వ్యతిరేకించడంతో తెలంగాణ శాసనసభలో రగడ నెలకొంది. ప్రశ్నోత్తరాల సమయంలో కల్యాణలక్ష్మి పథకంపై జరుగుతున్న చర్చలో భాగంగా బంగారుతల్లి పథకాన్ని కొనసాగిస్తారా? లేదా? అని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే డీకే అరుణ ప్రశ్నించడంతో గందరగోళం మొదలైంది. మంత్రి ఈటెల మాట్లాడుతూ, బంగారుతల్లి పథకం ఆ రాష్ట్రంతోనే పోయిందని, అయితే, ఈ పథకం కింద ఇప్పటికే రిజిస్టర్‌ చేయించుకుంటే ఆ అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని ఈటెల తెలిపారు. దీంతో సభలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ, కల్యాణలక్ష్మి కంటే బంగారుతల్లి మంచి పథకమని, ఈ పథకాన్ని కొనసాగిస్తారో, లేక రద్దు చేస్తారో స్పష్టం చేయాలని అన్నారు. చివరకు ప్రజలకు మేలు చేసే ఏ పథకాన్నీ రద్దు చేయబోమని మంత్రి ఈటెల సభలో ప్రకటించాల్సి వచ్చింది.

  • Loading...

More Telugu News