: మజ్లిస్ పార్టీ దేశానికి ప్రమాదకరం: కిషన్ రెడ్డి


మజ్లిస్ పార్టీపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రౌడీలు, గూండాలతో మజ్లిస్ పార్టీకి సంబంధం ఉందని ఆరోపించారు. మజ్లిస్ ఎదుగుదల రాష్ట్రానికి, దేశానికి ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. మజ్లిస్ తో బీజేపీకి సంబంధాలున్నాయని కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలను కిషన్ రెడ్డి ఖండించారు. ప్రమాదకర మజ్లిస్ పార్టీతో బీజేపీ ఎన్నడూ సంబంధాలు పెట్టుకోదని స్పష్టం చేశారు. వాస్తవానికి మజ్లిస్ కి కాంగ్రెస్ పార్టీ అండదండలు ఉన్నాయని... కాంగ్రెస్ హయాంలో మజ్లిస్ ఏది కోరితే దాన్ని ఆ పార్టీ క్షణాల్లో సమకూర్చేదని చెప్పారు. అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఇద్దరూ ప్రమాదకర వ్యక్తులని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News