: జపాన్ చేరుకున్న సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు తన 18 మంది బృందంతో జపాన్ చేరుకున్నారు. అక్కడి కన్సాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొద్దిసేపటి కిందట ల్యాండ్ అయ్యారు. అనంతరం క్యోటో వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడుల సేకరణే లక్ష్యంగా వెళ్లిన సీఎం, సూర్యోదయ దేశం నుంచి సూర్యోదయ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మొత్తం ఆరు రోజుల పర్యటనలో జపాన్ ప్రధాని, పారిశ్రామికవేత్తలతో బాబు బృందం సమావేశమై చర్చించనుంది. రాష్ట్ర శక్తి సామర్థ్యాలపై ప్రత్యేక డాక్యుమెంటరీ ప్రదర్శన ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా పలు సంస్థలతో ఆరు ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది.