: కాశ్మీర్ ఎన్నికల్లో ముఫ్తీకి ఎన్నికల కమిషన్ ఝలక్: మేనిఫెస్టో నిలుపుదల


జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో ప్రతిపక్ష పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) అధినేత్రి మెహబూబా ముఫ్తీకి ఎన్నికల సంఘం షాకిచ్చింది. సోమవారం విడుదల కానున్న ఆ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను నిలుపుదల చేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. తొలిదశ ఎన్నికల ప్రచారం ఆదివారం సాయంత్రంతో ముగిసిన నేపథ్యంలో సోమవారం ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయడం కుదరదంటూ కమిషనర్ ఆ నోటీసులో పేర్కొన్నారు. దీంతో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయకుండానే పీడీపీ తొలిదశ ఎన్నికల బరిలోకి దిగనుంది. ఎన్నికల మేనిఫెస్టోను సోమవారం విడుదల చేయనున్నట్లు ఆ పార్టీ ఆదివారం సాయంత్రం ప్రకటించింది. ఎన్నికల నియమావళి ప్రకారమే సదరు కార్యక్రమాన్ని రద్దు చేసుకోవాలని పీడీపీని ఆదేశించినట్లు ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు. మంగళవారం తొలిదశ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత ఆ పార్టీ తన మేనిఫెస్టోను విడుదల చేసుకోవచ్చని కమిషన్ వర్గాలు తెలిపాయి.

  • Loading...

More Telugu News