: ప్రమాణ స్వీకారానికి మెదక్ ఎంపీ గైర్హాజరు


మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి లోక్ సభలో ప్రమాణస్వీకారానికి హాజరు కాలేకపోయారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా సోమవారం లోక్ సభ ప్రారంభం కాగానే ఇటీవల సభకు కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారాన్ని స్పీకర్ సుమిత్ర మహాజన్ చేపట్టారు. కేంద్ర మాజీ మంత్రి గోపీనాథ్ ముండే కూతురు ప్రీతం ముండే ప్రమాణ స్వీకారం చేయగానే, కొత్త ప్రభాకర్ రెడ్డిని స్పీకర్ పిలిచారు. అయితే ఆ సమయంలో ఆయన సభలో లేరు. దీంతో కొద్దిసేపు వేచి చూసిన స్పీకర్, తర్వాతి సభ్యుడి పేరును పిలిచారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో గజ్వేల్ అసెంబ్లీ స్థానంతో పాటు మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్ రెండు చోట్లా విజయం సాధించారు. అయితే ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన మెదక్ ఎంపీ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో కేసీఆర్ స్థానంలో తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగిన కొత్త ప్రభాకర్ రెడ్డిని మెదక్ ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపించారు.

  • Loading...

More Telugu News