: స్పీకర్ కు లేఖ రాసిన టీటీడీపీ ఎమ్మెల్యేలు
తెలంగాణ శాసనసభ స్పీకర్ మధుసూదనాచారికి టీటీడీపీ ఎమ్మెల్యేలు లేఖ రాశారు. సభలో తమ హక్కులను కాపాడాలని లేఖలో విన్నవించారు. బీఏసీలో ఇద్దరు టీడీపీ సభ్యులకు అవకాశం కల్పించాలని కోరారు. బడ్జెట్ పై చర్చలో తమ సభ్యుడు ఆర్.కృష్ణయ్యకు మాట్లాడే అవకాశం కల్పించకపోవడాన్ని తప్పుబట్టారు. టీడీపీ శాసనసభ్యులను మంత్రి కేటీఆర్ ఆంగ్లోఇండియన్స్ తో పోలుస్తూ, ఆంధ్రా ప్రాంత నామినేటెడ్ ఎమ్మెల్యేలు అనడంపై నిరసన వ్యక్తం చేశారు.