: ఒబామాను ఏపీకి రప్పించేందుకు సన్నాహాలు చేస్తున్న చంద్రబాబు


గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ ను హైదరాబాద్ కు రప్పించిన చంద్రబాబు ఇప్పుడు మరోసారి అదే పనిలో పడ్డారు. భారత రిపబ్లిక్ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరవుతున్న యూఎస్ ప్రెసిడెంట్ ఒబామాను ఆంధ్రప్రదేశ్ కు రప్పించేందుకు పావులు కదుపుతున్నారు. విశాఖలో లేదా రాజధానిలో యూఎస్ కాన్సులేట్ ను ఏర్పాటు చేయాలని ఒబామాను చంద్రబాబు కోరనున్నారని సమాచారం. ఏపీని ఒమామా సందర్శిస్తే, రాష్ట్ర అభివృద్ధికి మేలు జరుగుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. ఒబామాను ఏపీకి రప్పించే విషయమై భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తో చంద్రబాబు భేటీ కానున్నారని సమాచారం.

  • Loading...

More Telugu News