: 2020 నాటికి పాక్ వద్ద 200 అణ్వాయుధాలు: అమెరికా అంచనా


అణ్వస్త్రాల సముపార్జనలో పాకిస్థాన్ దూకుడుగా వెళుతుండటంపై అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తోంది. అణ్వస్త్రాల సమీకరణకు సంబంధించి ప్రస్తుతం పాక్ వ్యవహరిస్తున్న తీరు కొనసాగితే, 2020 నాటికి ఆ దేశం వద్ద 200 దాకా అణ్వస్త్రాలు పోగయ్యే అవకాశాలున్నాయని అమెరికా విదేశీ వ్యవహారాల మండలి అభిప్రాయపడింది. "ప్రపంచంలోని పలు దేశాలు తమ అణ్వస్త్ర సంపత్తిని తగ్గించుకుంటుండగా, ఆసియా దేశాలు మాత్రం పెంచుకుంటున్నాయి. ఈ విషయంలో పాక్ దూకుడుగా వెళుతోంది. ఆ దేశం ప్రస్తుత వేగంతోనే ముందుకెళితే 2020 నాటికి 200 దాకా అణ్వస్త్రాలను సమకూర్చుకోవడం ఖాయమే. తత్ఫలితంగా దక్షిణాసియాకు పెను ముప్పు పొంచి ఉన్నట్టవుతుంది" అని ఆ మండలి ఆందోళన వ్యక్తం చేసింది.

  • Loading...

More Telugu News