: టీమిండియాను వెనక్కినెట్టిన కంగారూలు


వన్డే ర్యాంకింగ్స్ లో ఆస్ట్రేలియా తాజాగా టీమిండియాను వెనక్కినెట్టింది. ఐసీసీ నేడు విడుదల చేసిన వన్డే టీమ్ ర్యాంకింగ్స్ జాబితాలో కంగారూలు అగ్రస్థానం అధిష్ఠించారు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ను 4-1తో చేజిక్కించుకోవడం ఆసీస్ కు లాభించింది. దీంతో, భారత్ రెండోస్థానానికి పరిమితంకాక తప్పలేదు. ఇరుజట్ల పాయింట్లు (117) సమంగా ఉన్నా, దశాంశ స్థానాల తేడాతో ఆసీస్ కు నెంబర్ వన్ ర్యాంకు దక్కింది. ఈ టాప్-10 జాబితాలో దక్షిణాఫ్రికా (112) మూడోస్థానంలో ఉంది. ఆ తర్వాత వరుసగా శ్రీలంక, ఇంగ్లండ్, పాకిస్థాన్, న్యూజిలాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, వెస్టిండీస్ ఉన్నాయి.

  • Loading...

More Telugu News