: ముంబయి తీసుకెళ్లి ఆపరేషన్లతో హిజ్రాలుగా మారుస్తున్న మున్సిపల్ ఉద్యోగి


విజయవాడలో ఓ మున్సిపల్ ఉద్యోగి నిర్వాకం వెలుగులోకి వచ్చింది. రమణ అనే ఉద్యోగి కొందరిని ముంబయి తీసుకెళ్లి ఆపరేషన్లతో హిజ్రాలుగా మారుస్తున్నాడు. కొన్నాళ్లుగా ఈ తంతు కొనసాగుతోంది. అలా హిజ్రాలుగా మారిన వారిని విజయవాడ తీసుకుని వచ్చి, వారితో బలవంతంగా వసూళ్లు చేయిస్తున్నాడు. తాజాగా, రైళ్లలో డబ్బులు వసూలు చేయాలంటూ వారిని వేధించసాగాడు. నిరాకరించడంతో రమణ అనుచరులు హిజ్రాలను నిర్బంధించి, వారిని తీవ్రంగా కొట్టారు. ఈ దాడిలో పలువురు హిజ్రాలు గాయపడ్డారు. దీంతో, వారు అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్లో రమణ ముఠాపై ఫిర్యాదు చేశారు.

  • Loading...

More Telugu News