: జాన్సన్ ను ఎదుర్కొనేందుకు తగిన వ్యూహాలతోనే వచ్చాం: కోహ్లీ


టీమిండియా ఆసీస్ పర్యటన మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. అప్పుడే మాటల వేడి మొదలైంది. భారత్ కు ఈ పర్యటన మరో చేదు అనుభవం కానుందని ఆసీస్ మాజీలు అంటుండగా, ఇక్కడ గెలవలేకపోవడానికి ప్రస్తుతం కారణాలేమీ కనిపించడంలేదని టీమిండియా తాత్కాలిక సారథి విరాట్ కోహ్లీ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. అడిలైడ్ లో మీడియాతో మాట్లాడుతూ, ఆసీస్ పర్యటన, పరిస్థితులకు అలవాటు పడడం కంటే ఆలోచనా విధానానికి సంబంధించిన విషయం అని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. ఆసీస్ స్పీడ్ స్టర్ మిచెల్ జాన్సన్ మెరుగ్గా రాణిస్తున్నాడని, అయితే, అతన్ని ఎదుర్కొనేందుకు తగిన సాధనసంపత్తి తమ వద్ద ఉందని చెప్పుకొచ్చాడు. రెగ్యులర్ కెప్టెన్ ధోనీకి గాయం నేపథ్యంలో, కోహ్లీకి తొలి టెస్టులో కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడం తెలిసిందే. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా తొలి టెస్టు డిసెంబర్ 4 నుంచి 8 వరకు జరగనుంది. టెస్టు సిరీస్ అనంతరం టీమిండియా... ఆసీస్, ఇంగ్లండ్ జట్లతో ముక్కోణపు వన్డే సిరీస్ ఆడుతుంది.

  • Loading...

More Telugu News