: అవన్నీ నా పథకాలే... మోదీ కాపీ కొడుతున్నారు: ములాయం
గ్రామాలను దత్తత తీసుకోవడం, టాయిలెట్ల నిర్మాణం వంటి పథకాలు తమవేనని, 1990లోనే ప్రారంభించామని సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ చెప్పుకొచ్చారు. తాను ఉత్తరప్రదేశ్ సీఎంగా వ్యవహరించిన సమయంలో టాయిలెట్ల నిర్మాణంపై ప్రజలను చైతన్యపరిచానని తెలిపారు. ఇప్పుడు ఆ పథకాలనే ప్రధాని నరేంద్ర మోదీ కాపీ కొడుతున్నారని ములాయం ఆరోపించారు. ప్రధాని కొత్తగా చేస్తున్నదేమీ లేదని అన్నారు. అయితే, మోదీ విదేశీ పర్యటనపై ములాయం సానుకూల స్పందన వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలతో సత్సంబంధాలు అవసరమని అభిప్రాయపడ్డారు.