: సినీ తారల క్రికెట్ మ్యాచ్ ఏర్పాట్లు పరిశీలించిన శ్రీకాంత్
హుదూద్ తుపాను సృష్టించిన విలయం అనేకమంది జీవితాలను కష్టాల్లోకి నెట్టింది. అలాంటి వారిని ఆదుకునేందుకు సినీ తారలు ముందుకొచ్చారు. తమకు తోచిన విరాళాలు ప్రకటించిన వారు, ఓ ఛారిటీ క్రికెట్ మ్యాచ్ ద్వారా కూడా నిధులు సేకరించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో డిసెంబర్ 7న విజయవాడలో క్రికెట్ మ్యాచ్ ఆడనున్నారు. ఈ మ్యాచ్ కు నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగా నిలుస్తోంది. ఈ మ్యాచ్ కు జరుగుతున్న ఏర్పాట్లను ఆదివారం నటుడు శ్రీకాంత్, విజయవాడ ప్రజాప్రతినిధులు పరిశీలించారు.