: టీడీపీ పథకం బాగుందంటూ దిగ్విజయ్ తో చెప్పిన కాంగ్రెస్ నేతలు


కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తో సమన్వయ కమిటీ భేటీ ముగిసింది. కాగా, ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. కాంగ్రెస్ నేతలు టీడీపీ పథకాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వంతో పాటు ఇస్తున్న రూ.2 లక్షల బీమా పథకాన్ని వారు దిగ్విజయ్ దృష్టికి తీసుకెళ్లారు. కాంగ్రెస్ పార్టీ కూడా అలాంటి సౌకర్యం కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు. దీనికి దిగ్విజయ్ సానుకూలంగా స్పందించారు. అటు, డిసెంబర్ 9న సోనియా జన్మదినం నాడు నేతలంతా బూత్ స్థాయి మెంబర్ షిప్ డ్రైవ్ లో పాల్గొనాలని డిగ్గీరాజా సూచించారు.

  • Loading...

More Telugu News