: అఖిలేష్ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ములాయం
తన కుమారుడు అఖిలేష్ ప్రభుత్వంపై సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్ లో అభివృద్ధి కార్యక్రమాలు నత్తనడకన సాగుతున్నాయని అన్నారు. అనేక ప్రాజెక్టులు నిర్దేశిత సమయం అయిపోయినా పూర్తవలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో జరగాల్సింది ఎంతో ఉందని... పరిపాలన ఇలాగే కొనసాగితే ప్రజల్లో వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందని సూచించారు.