: తెలంగాణలో అలజడి సృష్టిస్తూ చంద్రబాబు పైశాచిక ఆనందం పొందుతున్నారు: శ్రీనివాస్ గౌడ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలంగాణలో అలజడి సృష్టిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. వెన్నుపోటు రాజకీయాలకు చంద్రబాబు పాల్పడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో టీడీపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిన చంద్రబాబు... బీసీ వ్యక్తిని కనీసం ఫ్లోర్ లీడర్ కూడా చేయలేదని అన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు శాసనసభను తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తున్నారని... స్పీకర్ పైనే అవిశ్వాస తీర్మానం పెడతామని వారు హెచ్చరించడం దుర్మార్గమని చెప్పారు.