: నేడు జపాన్ కు పయనమవుతున్న చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ (ఆదివారం) అర్ధరాత్రి జపాన్ వెళుతున్నారు. రాష్ట్ర మంత్రులు యనమల రామకృష్ణుడు, పి.నారాయణ, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ లతో పాటు మొత్తం 19 మందితో కూడిన బృందం కూడా ముఖ్యమంత్రి వెంట వెళుతోంది. పర్యటనలో భాగంగా జపాన్ ప్రధానితో పాటు ప్రముఖ వ్యాపారవేత్తలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. ఏపీ అభివృద్ధిలో పాలుపంచుకోవాలని ఆహ్వానించనున్నారు. ఈ పర్యటనలో దాదాపు 6 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోనున్నారని సమాచారం. ఈ నెల 29 వరకు వీరి పర్యటన కొనసాగుతుంది.