: నేడు టీఎస్ కేబినెట్ భేటీ... పలు నిర్ణయాలకు ఆమోదముద్ర
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం నేడు సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సచివాలయంలో జరిగే ఈ భేటీలో పలు అంశాలపై చర్చించనున్నారు. కొన్ని కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేయనున్నారు. ముఖ్యంగా తెలంగాణ నూతన పారిశ్రామిక విధానానికి ఆమోదముద్ర పడనుంది. హుస్సేన్ సాగర్ ప్రక్షాళన, చెరువుల పునరుద్ధరణ, హరితహారం తదితర విధాన నిర్ణయాలకు ఆమోదం తెలపనుంది. ఉద్యోగులకు ఉచిత వైద్య సేవల పథకం, ఇంటర్ విద్యామండలి విభజన, పలు ప్రభుత్వ రంగ సంస్థల విభజన, ఆకాశ హర్మ్యాల నిర్మాణం, దళిత, గిరిజన ఇంజినీర్ల ఉపాధికి రూ. 15 లక్షల మేరకు పనుల అప్పగింత తదితర అంశాలపై చర్చించనున్నారు.