: రైల్వే స్టేషన్ లో పాము...ప్రయాణికులు పరుగో పరుగు!
రైల్వే స్టేషన్ వచ్చీపోయే వారు, టికెట్లు తీసుకునే వారితో బిజీబిజీగా ఉంది. రైల్వే సిబ్బంది, ప్రయాణికులు ఎవరి పనుల్లో వారున్నారు. ఇంతలో ఎక్కడి నుంచి ఎలా వచ్చిందో ఎవరికీ తెలియదు కానీ, వరంగల్ జిల్లా మహబూబాబాద్ రైల్వే బుకింగ్ కార్యాలయంలో ఒక్కసారిగా పాము ప్రత్యక్షమైంది. అంతే... రైల్వే స్టేషన్ లో కలకలం రేగింది. దీంతో రైల్వే సిబ్బంది, ప్రయాణికులు పరుగందుకున్నారు.