: విమానమొస్తోంది, గేటేసేయండి... విమానం వెళ్లింది, గేటు తీయండి!


మన దేశంలో రైలు వచ్చే ముందు, ట్రాక్ కు అడ్డంగా వచ్చే దారుల్లో రెండు వైపులా వాహనాలు రాకుండా గేట్లు వేసేస్తారు. ట్రైన్ వెళ్లిపోయాక గేట్లు తెరుస్తారు. అచ్చం ఇలాంటి సీన్ విమానాలకు జరుగుతుందని కలలోనైనా ఊహించగలరా? కానీ విమానమొస్తోందంటూ రెండు వైపులా వాహనాలు రాకుండా గేట్లు వేసేస్తారు. ఇంగ్లండ్ రాజరికపు, రాయల్ ఎయిర్ ఫోర్స్ అధీనంలో ఉన్న జిబ్రాల్టర్‌ విమానాశ్రయం రన్ వే, నాలుగు లేన్ల ప్రధాన రహదారికి మధ్యలో ఉంది. దీంతో విమానం వచ్చినప్పుడు లేదా వెళ్లినప్పుడల్లా రెండు వైపులా గేట్లు వేసేసి, వాహనాలను నిలిపేస్తారు. విమానం రాకపోకలు ముగియగానే వాహనాలను యథావిధిగా అనుమతిస్తారు. ఈ విమానాశ్రయం తక్కువ స్థలంలో ఉండడం, అదనపు స్థలంలో భూమి సమతలంగా ఉండకపోవడంతో రోడ్డు మధ్యలో రన్ వేను నిర్మించాల్సి వచ్చింది.

  • Loading...

More Telugu News