: సల్మాన్-షారుక్ 'ఛయ్య ఛయ్యా డాన్స్!'


అనుకోని విధంగా కలసిన సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ లు అర్పితాఖాన్ వివాహం సందర్భంగా తెగ ఎంజాయ్ చేశారు. ముందు అర్పితా సంగీత్ లో గంటలు గంటలు మాట్లాడుకున్న వాళ్లిద్దరూ, తాజాగా అర్పితా వివాహ రిసెప్షన్ లో కలసి డాన్స్ చేశారట. బాంద్రాలోని తాజ్ లాండ్స్ ఎండ్ హోటల్లో అర్పితా, ఆయుష్ ల రిసెప్షన్ గ్రాండ్ గా జరిగింది. షారుక్ సహా బాలీవుడ్ సినీ ప్రముఖులంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా 'దిల్ సే' చిత్రంలోని 'ఛయ్య ఛయ్య ఛయ్యా ఛయ్యా...' వంటి పలు ఫాస్ట్ బీట్ పాటలకు సల్లూ, షారుక్ డాన్స్ చేశారు. ఒకరిపై ఒకరు జోక్ లు వేసుకుంటూ ఉత్సాహంగా గడిపారు. అప్పుడే హీరో హృతిక్ రోషన్ కూడా వారితో కలసి తనూ స్టెప్స్ వేశాడట.

  • Loading...

More Telugu News