: చైనాలో భూకంపం
నైరుతి చైనా ప్రాంతంలోని సిచువాన్ పరిధిలో శనివారం మధ్యాహ్నం 1:25 గంటల సమయంలో (భారత కాలమానం ప్రకారం) భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 6.3గా నమోదైందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే విభాగం తెలిపింది. భూమికి 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నదని వివరించింది. కాగా, భూకంపం కారణంగా ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టాలు జరిగినట్టు సమాచారం అందలేదు.