: లండన్ లోని స్టార్ హోటల్ లో పేలుడు: 14 మందికి గాయాలు


లండన్ లో నిత్యం రద్దీగా ఉండే చర్చి హిల్ ప్రాంతంలోని స్టార్ హోటల్ హయత్ రీజెన్సీలో జరిగిన గ్యాస్ పేలుడు ఘటనలో 14 మంది గాయపడ్డారు. అర్ధరాత్రి ఈ ఘటన జరగగా తొలుత ఉగ్రవాద చర్యగా భావించిన పోలీసులు ఆ తరువాత గ్యాస్ లీకయిందని తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించినట్టు లండన్ అంబులెన్స్ సర్వీస్ వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనతో హోటల్ లోని 400 గదుల నుంచి దాదాపు 500 మందిని ఖాళీ చేయించారు. అతిథులకు ఎవరికీ గాయాలు కాలేదని, హోటల్ సిబ్బందిలో మాత్రం కొందరు గాయపడ్డారని హయత్ రీజెన్సీ ఒక ప్రకటనలో తెలిపింది.

  • Loading...

More Telugu News