: విశాఖ ఏజెన్సీలో రెడ్ అలెర్ట్


విశాఖ ఏజెన్సీలో పోలీసులు రెడ్ అలెర్ట్ ప్రకటించారు. రాష్ట్ర విభజన అనంతరం ఏవోబీలో మావోయిస్టుల ప్రాబల్యం పెరుగుతూ వస్తోంది. నెమ్మదిగా మావోల కదలికలు ప్రారంభమయ్యాయి. అరకు ప్రాంతంలో మావోలకు వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో తమ ప్రాబల్యం పెంచుకునేందుకు వారు దాడులు జరిపేందుకు సంసిద్ధులవుతున్నారని ఇంటెలిజెన్స్ కు సమాచారం అందింది. దీంతో, ఏ క్షణానైనా మావోలు విరుచుకుపడే ప్రమాదం ఉందని, అప్రమత్తంగా ఉండాలని విశాఖ ఏజెన్సీ పోలీసులను ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో 'హై అలెర్ట్'ను ప్రకటించారు. సరిహద్దుల్లో ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేసి కానీ వదలడం లేదు. ఒడిషా సరిహద్దుల్లోని ప్రతి గ్రామాన్ని డేగకళ్లతో పోలీసులు పరిశీలిస్తున్నారు.

  • Loading...

More Telugu News