: తృణమూల్ పై బీజేపీ సర్కార్ కక్ష: మమత


తనపైన, తన పార్టీపైన బీజేపీ కక్ష కట్టిందని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. సీబీఐని కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన నెహ్రూ జయంతి వేడుకలకు హాజరయినందుకే తమ ఎంపీలను అరెస్టు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. సీబీఐ విశ్వసనీయతను స్వయంగా సుప్రీంకోర్టే తప్పుబట్టిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. బీజేపీ ఎన్నికల ప్రచారం నిమిత్తం చేసిన ఖర్చుపై మీడియా సైతం సరైన రీతిలో స్పందించలేదని ఆమె విమర్శించారు.

  • Loading...

More Telugu News