: ముఖ్యమంత్రి కేసీఆర్ ది పెద్ద మనసు: కోమటిరెడ్డి వెంకటరెడ్డి
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలంగాణా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. సీఎం కేసీఆర్‌ది పెద్ద మనసు అని కొనియాడుతూ, ఆయనవల్లే ఎస్‌ఎల్‌బీసీ, ఉదయ సముద్రం ప్రాజెక్టులను పూర్తి చేయడానికి నిధులు వచ్చాయని తెలిపారు. కేసీఆర్ సహకారంతో నల్లగొండ జిల్లాను అభివృద్ధి దిశగా నడిపిస్తానని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. ఏ పార్టీలో ఉన్నా తనకు ప్రజల సంక్షేమమే ధ్యేయమని స్పష్టం చేశారు. త్వరలోనే సీఎం చేతుల మీదుగా నల్లగొండలో మెడికల్ కళాశాలకు శంకుస్థాపన చేయిస్తానని తెలిపారు.