: మహిళలను వేధిస్తూ 'షీ టీమ్స్'కు చిక్కిన 80 మంది


హైదరాబాద్ నగర రహదారులపై నిఘా పెట్టిన 'షీ టీమ్స్'కు 80 మంది చిక్కారు. మహిళలు, విద్యార్థినులను వేధించడం, అసభ్యంగా కామెంట్స్ చేయడం వంటి నేరాలు చేసిన 80 మందిని షీ టీమ్స్ అదుపులోకి తీసుకొని వారిలో 16 మందిని నేడు కోర్టులో హాజరు పరిచింది. వీరిలో ఆరుగురికి 2 రోజులు, మరో ఇద్దరికి 3 రోజుల జైలు శిక్ష, జరిమానా, మరో ఎనిమిది మందికి రూ. 50 జరిమానాను కోర్టు విధించింది. ఈ సందర్భంగా అదనపు సీపీ స్వాతి లక్రా మాట్లాడుతూ బస్టాపుల్లో ఈవ్‌టీజింగ్‌కు పాల్పడితే 2 రోజుల జైలు శిక్ష పడుతుందని హెచ్చరించారు. 15 మహిళా కళాశాలల వద్ద నిఘా పెట్టామని, నేరం చేస్తే నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేస్తామని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News