: శ్రీకాంత్ కూడా హాంకాంగ్ ఓపెన్ నుంచి వెనుదిరిగాడు
హాంకాంగ్ ఓపెన్ బ్యాడ్మింటన్ సిరీస్ నుంచి భారత షట్లర్ కిదాంబి శ్రీకాంత్ కూడా బయటికొచ్చాడు. ఇక్కడ జరిగిన పురుషుల సింగిల్స్ సెమీ ఫైనల్స్ లో ప్రపంచ ఛాంపియన్ చైనా ఆటగాడు చెన్ లాంగ్ చేతిలో ఓడిపోయాడు. దాదాపు గంటా నాలుగు నిమిషాల పాటు ఇక్కడ జరిగిన మ్యాచ్ లో 17-21, 21-19, 6-21 తేడాతో శ్రీకాంత్ పరాజయం పాలయ్యాడు. అంతకుముందు భారత షట్లర్లు సైనా నెహ్వాల్, పీవీ సింధు కూడా ఈ సిరీస్ నుంచి వెనుదిరిగిన సంగతి తెలిసిందే.