: హ్యాకింగ్ బారిన ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్స్!


ఆండ్రాయిడ్, ఐఓఎస్ కు చెందిన యాప్స్ హ్యాకింగ్ బారినపడ్డట్టు ప్రముఖ మొబైల్ భద్రతా సంస్థ ఆర్ క్సన్ టెక్నాలజీస్ వెల్లడించింది. ఈ రెండింటికి చెందిన యాప్స్ 75 నుంచి 97 శాతం వరకు హ్యాక్ అయినట్టు వివరించింది. ఈ నేపథ్యంలో యాప్స్ డౌన్ లోడ్ చేసుకునే సమయంలో వినియోగదారులందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించింది. 'మొబైల్ యాప్ సెక్యూరిటీ స్టేట్'లో మొత్తం వంద చెల్లింపు యాప్స్, 20 అత్యంత పాప్యులర్ అయిన ఉచిత యాప్స్ ఉన్నాయని తన నివేదికలో తెలిపింది. అందులో 97 శాతం చెల్లింపు ఆండ్రాయిడ్ యాప్స్, 87 శాతం ఐఓఎస్ యాప్స్ హ్యాక్ అయ్యాయని వివరించింది. ఇక ఉచిత యాప్స్ విషయానికొస్తే... ఆండ్రాయిడ్ లో 80 శాతం, ఐఓఎస్ లో 75 శాతం యాప్స్ కు హాని ఉన్నట్టు తెలిసిందట. ఈ అప్లికేషన్స్ ను లక్ష్యం చేసుకుని హ్యాకర్స్ ద్వేషపూరిత, ఆధునిక దాడులు చేస్తున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొంది.

  • Loading...

More Telugu News