: భారత్ మార్కెట్ లోకి త్వరలో 'మైక్రోసాఫ్ట్ ల్యూమియా' బ్రాండ్
నోకియా పేరు తొలగించిన కొద్ది రోజులకే మైక్రోసాఫ్ట్ నుంచి 'ల్యూమియా' బ్రాండ్ మరికొన్ని రోజుల్లో భారత్ లో విడుదల కాబోతోంది. ఈ మేరకు తొలి మైక్రోసాఫ్ట్ ల్యూమియా 535 స్మార్ట్ ఫోన్ ను వచ్చే బుధవారం (ఈ నెల 26) లాంచ్ చేస్తున్నారు. ఇందుకోసం మైక్రోసాఫ్ట్ ఇండియా ఇప్పటికే పలువురికి ఆహ్వానాలు కూడా పంపిందట. "ఐదు రోజుల్లో ట్రిపుల్ 5 మ్యాజిక్" అంటూ ఆహ్వానంలో తెలిపింది. అంటే "5x5x5" మైక్రోసాఫ్ట్ ల్యూమియా 535 ను సూచిస్తుంది. ఈ ఫోన్ వివరాల్లోకి వెళితే, సింగిల్ సిమ్, డ్యూయెల్ సిమ్ అంటూ అదే పేరుతో రెండు రకాలుగా ఈ విండోస్ స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వస్తోంది.