: బ్యాంకును కొల్లగొట్టింది అటెండరే!
వరంగల్ జిల్లా భూపాలపల్లి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంకులో జరిగిన చోరీ కేసులో ప్రధాన నిందితుడు బ్యాంకులో పనిచేస్తున్న అటెండరేనని పోలీసులు గుర్తించారు. బయట తాళాలు వేసినవి వేసినట్టు ఉండగానే లోపల నగలు, నగదు మాయం కావటం వెనుక సిబ్బంది హస్తం తప్పక ఉంటుందని భావిస్తూ, ఆ కోణంలో దర్యాఫ్తు జరిపిన పోలీసులకు అటెండర్ రమేష్ నిందితుడని తేలింది. బ్యాంకు నుంచి ఎత్తుకెళ్ళిన 34 కిలోల బంగారం, రూ.22 లక్షల నగదును కరీంనగర్ లోని బంధువుల ఇళ్ళలో రమేష్ దాచి ఉంచినట్టు పోలీసులు గుర్తించారు. రమేష్ ఇంట్లో సైతం తనిఖీలు చేపట్టారు.