: బీజేపీలోకి ఆప్ నేతల క్యూ!
కొత్తగా రంగంలోకి దిగిన ఆమ్ ఆద్మీ పార్టీకి అప్పుడే కష్టాలు మొదలయ్యాయి. మొన్నటికి మొన్న ఢిల్లీ ప్రజలిచ్చిన అవకాశాన్ని చేజేతులా నేలపాల్జేసిన పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పై అటు ప్రజల్లోనే కాక పార్టీలోనూ నానాకిటీ నమ్మకం తగ్గిపోతోంది. ఇందుకు నిదర్శంగా మొన్నటి ఎన్నికల్లో పార్టీ తరఫున ఎమ్మెల్యే బరిలో నిలిచి గెలిచిన మణిందర్ సింగ్ ధిర్ శుక్రవారం కాషాయ కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు పార్టీ నేత, మరో ఎమ్మెల్యే హరీశ్ ఖన్నా కూడా బీజేపీలో చేరిపోయారు. రానున్న ఎన్నికల్లో ఆప్ తరఫున బరిలో నిలిచే ప్రసక్తే లేదని ఖన్నా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బీజేపీ విజయానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ధిర్ ప్రకటించారు.