: కాశ్మీర్ అంశాన్ని భారత్ తో చర్చించండి... ఒబామాకు షరీఫ్ విజ్ఞప్తి


కాశ్మీర్ అంశంపై పాకిస్థాన్ తో చర్చలు జరిపేందుకు భారత్ ససేమిరా అంటుండటంతో ఆ దేశ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ స్పందించారు. ఈ విషయాన్ని భారత్ పర్యటనలో ఎలాగైనా చర్చించాలని అమెరికా అధ్యక్షుడు ఒబామాను కోరారు. వచ్చే ఏడాది భారత్ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా వెళుతున్నానంటూ షరీఫ్ కు ఫోన్ చేసి ఒబామా స్వయంగా తెలిపారు. ఈ సమయంలోనే కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తాలని షరీఫ్ విజ్ఞప్తి చేసినట్టు పాక్ పీఎంవో కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. గతంలో కాశ్మీర్ విషయంపై చేసిన తీర్మానం వల్ల శాంతి, స్థిరత్వం, దక్షిణాసియా ప్రాంతానికి ఆర్థిక సహకారం లభిస్తుందని వివరించినట్టు వెల్లడించింది. దాంతోపాటు ఇంకా పలు విషయాలపై వారు మాట్లాడుకున్నట్టు పాక్ పీఎంవో పేర్కొంది.

  • Loading...

More Telugu News