: యాదగిరిగుట్టలో ఏపీ ఆర్థిక మంత్రి
యాదగిరిగుట్టలోని శ్రీలక్ష్మీనరసింహస్వామివారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు దర్శించుకున్నారు. శనివారం వేకువఝామున గుట్ట చేరుకున్న ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. యనమలకు ఆలయ అధికారులు స్వాగతం పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రెండు రాష్ట్రాలలోని తెలుగు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు.