: పాకిస్తాన్ ఎంపీలపై గ్రనేడ్ దాడి


పాకిస్థాన్లోని కరాచీలో జరుగుతున్న ముత్తహిదా ఖ్వామి మూవ్ మెంట్ (ఎంక్యూఎం) పార్టీ సభ్యత్వ నమోదు కార్యాలయంలో దుండగులు విసిరిన గ్రనేడ్లు పేలగా ముగ్గురు పార్లమెంట్ సభ్యులు సహా 20 మందికి పైగా గాయపడ్డారు. వీరిని నగరంలోని వివిధ ఆసుపత్రులకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడికి పాల్పడింది తామేనని తెహ్రిక్ -ఏ- తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) ప్రకటించింది. క్షతగాత్రులలో ఎంపీలు మహ్మద్ హుస్సేన్, షేక్ అబ్దుల్లా, సైఫుద్దీన్ ఖలీద్లు ఉన్నారు. పలువురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు చెప్పారు.

  • Loading...

More Telugu News