: నేడు కాశ్మీర్ ఎన్నికల ప్రచారానికి ప్రధాని మోదీ!
ప్రధాని నరేంద్ర మోదీ నేడు జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. కాశ్మీర్ లోని కిస్త్ వాడ్ లో ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసిన బీజేపీ, కాశ్మీర్ లోనూ తొలిసారిగా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు పక్కాగా ప్రణాళికలు రచించింది. ఇందులో భాగంగా తాను పోటీ చేస్తున్న స్థానాల్లో 40 శాతానికి పైగా సీట్లను ముస్లింలకు కేటాయించింది. రాష్ట్రంలో తొలి విడత ఎన్నికలు ఈ నెల 25న జరగనున్నాయి.