: ప్రతిపక్ష నేత సీట్లో మల్లికార్జున ఖర్గే!
అదేంటీ, మొత్తం సభ్యుల సంఖ్యలో పది శాతం మంది సభ్యులు కూడా లేని కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చేది లేదంటూ మోదీ సర్కారు నిన్నటిదాకా మొండికేసింది కదా? అనేగా మీ సందేహం. అది నిజమే, సభలో కనీస బలం లేని కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదాను మోదీ సర్కారు ఇప్పటికీ ఇవ్వలేదు. కానీ, ప్రతిపక్ష నేత కూర్చునే సీటు మాత్రం దక్కింది. లోక్ సభలో ప్రతిపక్ష నేత కూర్చునే సీటును మల్లికార్జున ఖర్గేకు కేటాయిస్తూ స్పీకర్ సుమిత్రా మహాజన్ నిర్ణయం తీసుకున్నారు. సభలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేతగా ఖర్గే వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. స్పీకర్ తాజా నిర్ణయంతో ఇకపై ఖర్గే, తొలి వరుసలో పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఎస్పీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్, జేడీ (ఎస్) నేత దేవేగౌడలతో కలిసి కూర్చుంటారు.