: ఉచిత విద్యుత్ కు 15 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం: కేసీఆర్


రాష్ట్రంలో 7 గంటల ఉచిత విద్యుత్ కు 15 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, సోలార్ పంపుసెట్ల ప్రోత్సాహానికి బడ్జెట్ లో 240 కోట్లు కేటాయించామని అన్నారు. ఒకేసారి కాకుండా పైలట్ ప్రాజెక్టు కింద సోలార్ పంపుసెట్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఇందుకు అయ్యే ఖర్చును అంచనా వేయాలని ఆయన అధికారులకు సూచించారు. అనంతరం కిర్లోస్కర్ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడుతూ, పదేళ్లపాటు సోలార్ మోటార్ల నిర్వహణ తామే చూస్తామన్నారు. ఇందుకయ్యే ఖర్చు పదేళ్ల తరువాత చెల్లిస్తే సరిపోతుందని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News