: నా జీవిత చరిత్ర సిద్ధమవుతోంది: సానియా మీర్జా
తన జీవిత చరిత్ర సిద్ధమవుతోందని టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తెలిపింది. హైదరాబాదులో ఆమె మాట్లాడుతూ, తన జీవిత చరిత్ర 2015లో మార్కెట్ లోకి వస్తుందని చెప్పింది. తనకు నటనపై ఆసక్తి లేదని, 2016 ఒలింపిక్స్ పై దృష్టి పెట్టానని, మహిళల డబుల్స్ గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధిస్తే తన కల సాకారమవుతుందని సానియా వెల్లడించింది. కాగా, సోనీ పిక్స్ ఛానెల్ లో అమ్మాయిలను పడగొట్టాలంటే ఏం చేయాలో అబ్బాయిలకు చిట్కాలు చెప్పనుందని సమాచారం. నవంబర్ 22 నుంచి 12 వారాల పాటు 'పిక్స్ స్కూల్ ఆప్ బాండింగ్' పేరిట ఆ కార్యక్రమం ప్రసారం కానుందని సమాచారం.