: అసంతృప్తితో వెళ్లిపోయిన అక్బరుద్దీన్
బీఏసీలో చర్చించకుండానే అసెంబ్లీ సమావేశాలను పొడిగించడంపై ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభ నిబంధనలపై గౌరవం లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. షెడ్యూల్ ప్రకారం సభ నిర్వహణ శనివారం వరకే ఉందని... అలాంటప్పుడు సభను సోమవారానికి ఎలా వాయిదా వేస్తారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా, అక్బర్ ను సముదాయించేందుకు మంత్రి హరీష్ రావు ప్రయత్నించారు. కానీ, తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ అక్బర్ వెళ్లిపోయారు. అనంతరం, బీఏసీ సమావేశం ప్రారంభమయింది. ఈ సమావేశాన్ని టీడీపీ, ఎంఐఎంలు బహిష్కరించాయి.