: సీబీఎస్ఈలో మూడో భాషగా సంస్కృతాన్ని తప్పనిసరి చేయండి: సంస్కృత భారతి


కేంద్రీయ విద్యాలయాల నుంచి మూడో భాషగా కొనసాగుతున్న జర్మనీని తొలగించే విషయంలో విజయం సాధించిన ఆరెస్సెస్ అనుబంధ విభాగం సంస్కృత భారతి, తాజాగా కేంద్రం ముందు మరో ప్రతిపాదనను పెట్టింది. దేశంలోని సీబీఎస్ఈ సిలబస్ తో కొనసాగుతున్న అన్ని విద్యాలయాల్లో ఇకపై సంస్కృతాన్ని మూడో భాషగా తప్పనిసరి చేయాలని ఆ సంస్థ, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖను కోరింది. ఇదిలా ఉండగా, సీబీఎస్ఈలో విదేశీ భాషలను వ్యతిరేకిస్తున్న ఆరెస్సెస్ అనుబంధ విభాగం సంస్కృత శిక్షక్ సంఘ్ మరో అడుగు ముందుకేసి, సీబీఎస్ఈ పాఠశాలల్లో మూడో భాషగా కొనసాగుతున్న అన్ని విదేశీ భాషలను ఉపసంహరించాలని డిమాండ్ చేసింది. మరి ఈ డిమాండ్లపై కేంద్రం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

  • Loading...

More Telugu News