: వరల్డ్ ఛాంపియన్ షిప్ లో నాకింకా ఛాన్సులున్నాయి: ఆనంద్
వరల్డ్ చెస్ ఛాంపియన్ షిప్ లో తొమ్మిదో రౌండ్ ను డ్రా చేసుకున్న అనంతరం భారత నెంబర్ వన్ చెస్ క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్ మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. డిఫెండింగ్ ఛాంప్ మాగ్నస్ కార్ల్ సన్ తో పోరులో తనకింకా అవకాశాలున్నాయని తెలిపాడు. ఈ గేములో నల్లపావులతో ఆడి డ్రా చేసుకున్నానని, తదుపరి రౌండ్ లో తెల్లపావులతో విజయం కోసం శ్రమిస్తానని అన్నాడు. ప్రస్తుతం 10వ రౌండ్ గేముపైనే దృష్టి పెట్టానని తెలిపాడు. కాగా, ప్రపంచ విజేతను తేల్చేందుకు మరో మూడు రౌండ్లు మాత్రమే మిగిలున్న నేపథ్యంలో విజయంపై ఆనంద్ ఆశాభావం వ్యక్తం చేశాడు. 12 రౌండ్ల ఈ ఛాంపియన్ షిప్ లో 9 రౌండ్ల అనంతరం కార్ల్ సన్ 5 పాయింట్లు, ఆనంద్ 4 పాయింట్లతో ఉన్నారు. ఈ పోరు రష్యాలోని సోచి వేదికగా జరుగుతోంది.