: హిందూ మాజీ ఎడిటర్ ఎన్ రామ్ కు రామచంద్రన్ అవార్డు
ప్రముఖ దినపత్రిక హిందూ మాజీ చీఫ్ ఎడిటర్, సీనియర్ జర్నలిస్టు ఎన్ రామ్ కు రామచంద్రన్ ఫౌండేషన్ అవార్డు లభించింది. ఈ అవార్డు కింద రూ.50 వేల నగదుతోపాటు జ్ఞాపికను అందజేస్తారు. జర్నలిజంలో రామచంద్రన్ చేసిన సేవలకుగాను ఆయన పేరు మీద ఈ ఫౌండేషన్ అవార్డును నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఈ నెల 25వ తేదిన మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎమ్ఎన్ వెంకటాచలయ్య ఈ అవార్డును రామ్ కు బహూకరించనున్నారు.