: ఎన్టీఆర్ పేరు పెట్టాలన్న కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శాసనసభలో తీర్మానం
శంషాబాద్ ఎయిర్ పోర్టు డొమెస్టిక్ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరు పెట్టాలన్న కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దివంగత ఎన్టీఆర్ పై గౌరవం ఉన్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త పేర్లను పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నామని ఈ సందర్భంగా కేసీఆర్ అన్నారు. ఎయిర్ పోర్టు పేరుకు సంబంధించి ప్రస్తుత పరిస్థితినే కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నట్టు తీర్మానంలో పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని కాంగ్రెస్ బలపరిచింది. ఎంఐఎం కూడా ఈ తీర్మానాన్ని బలపరిచింది. ప్రస్తుతం ఈ తీర్మానంపై చర్చ కొనసాగుతోంది.