: తెలుగు జాతిలో ఎన్టీఆర్ గొప్ప నేత: అక్బరుద్దీన్ ఒవైసీ
తెలుగు జాతిలో దివంగత నందమూరి తారక రామారావు నిజంగా గొప్ప నేతేనని మజ్లిస్ శాసనసభా పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. శంషాబాద్ విమానాశ్రయంలోని డొమెస్టిక్ టెర్మినల్ పేరును ఎన్టీఆర్ టెర్మినల్ గా మారుస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై శుక్రవారం సభలో జరిగిన చర్చ సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు. అయితే ఎన్టీఆర్ మరణానికి కారణమైన వారే ఆయన గొప్పతనంపై మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఆయన టీడీపీ నేతలను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. ఆయా సంస్థలు, నిర్మాణాల పేర్లను తరచూ మార్చడం మాత్రం సరికాదని ఆయన పేర్కొన్నారు.