: హాంకాంగ్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో సైనా ఓటమి
హాంకాంగ్ ఓపెన్ సిరీస్ బ్యాండ్మింటన్ టోర్నీలో హైదరాబాదీ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ఓటమి పాలైంది. చైనాకు చెందిన తాయ్ జూయింగ్ చేతిలో 15-21, 19-21 తేడాతో సైనా క్వార్టర్ ఫైనల్లో పరాజయం పాలైంది. నిన్న (గురువారం) ఇదే సిరీస్ నుంచి పీవీ సింధు వైదొలగిన సంగతి తెలిసిందే. ఇంకా భారత్ నుంచి కిదాంబి శ్రీకాంత్ ఒక్కడే హాంకాంగ్ ఓపెన్ సిరీస్ లో ఉన్నాడు.