: తెలంగాణలో ఎయిర్ పోర్టుకు ఎన్టీఆర్ పేరా... కేంద్రంతో బాబు కుమ్మక్కయ్యారు: డీకే అరుణ


శంషాబాద్ ఎయిర్ పోర్టులో డొమెస్టిక్ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరు పెట్టడంపై మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డీకే అరుణ మండిపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద అరుణ మాట్లాడుతూ, ఎయిర్ పోర్టు పేరు మార్పును ఖండించారు. రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలర్పించారని, ఆయన పేరునే కొనసాగించాలని డిమాండ్ చేశారు. కేంద్రంతో ఏపీ సీఎం చంద్రబాబు కుమ్మక్కయిన ఫలితమే పేరు మార్పు నిర్ణయం అని ఆరోపించారు. అటు, తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డొమెస్టిక్ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని వ్యతిరేకించారు.

  • Loading...

More Telugu News