: ముందు మీరు, ఆ తర్వాతే మేము: సర్కారుకు టీటీడీపీ సవాల్
మైహోం వ్యవహారానికి సంబంధించి గురువారం అసెంబ్లీలో జరిగిన చర్చపై శుక్రవారం ఆ పార్టీ నేత ఎర్రబెల్లి దయాకరరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మైహోం వ్యవహారంపై తమ పార్టీ సభ్యుడు రేవంత్ రెడ్డి సభలో పెడతానన్న ఆధారాల విషయంపై విలేకరుల ప్రశ్నకు స్పందించిన ఎర్రబెల్లి, తొలుత ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసిన మరుక్షణమే తమ సభ్యుడి ఆధారాలు కూడా సభలోకి వస్తాయని ఆయన వెల్లడించారు. శ్వేతపత్రం కాపీలను స్పీకర్ కార్యాలయానికి అందించామని చెబుతున్న ప్రభుత్వం, సదరు పత్రాన్ని సభలో పెట్టడంలో ఎందుకు జాప్యం చేస్తోందని ఆయన ప్రశ్నించారు.